Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి

Updated on: Oct 24, 2025 | 4:49 PM

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. జిల్లాకి చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం MLA గొoడు శంకర్ పైకి పిస్టల్ ను ఎక్కుపెట్టారు. అది కూడా జిల్లా SP మహేశ్వర రెడ్డి, జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలోనే ఈ సరదా సంఘటన చోటు చేసుకుంది. జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పోలీసు అమరవీరుల దినోత్సవo కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అచ్చెన్నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్న పేట నియోజకవర్గాల MLA లు గొండు శంకర్,బగ్గు రమణ మూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. పోలీసుల అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి. పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపకాలను అందజేశారు మంత్రి. ఆ తర్వాత ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుల ఆయుధ సంపత్తిని మంత్రి అతనితో పాటు వచ్చిన MLAలు తిలకించారు. పోలీసుల ఆయుధ సంపత్తిని తిలకించే క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రదర్శనను తిలకిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ఓ పిస్టల్ ను తీసి పరిశీలించారు. అలా చూస్తూ చూస్తూ సరదాగా పక్కనే ఉన్న MLA గొoడు శంకర్ భుజంపై చేయి వేసి.. పిస్తోల్ ని ఆయనకు గురిపెట్టారు. ఆ సరదా సన్నివేశం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారి నవ్వుకున్నారు. అనంతరం ఆయుధ సంపత్తిని తిలకించి , వాటి పనితీరును పోలీసులకు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీస్ డాగ్ స్క్వాడ్ వద్ద మంత్రి అచ్చెన్న కాసేపు గడిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెల రోజులు.. 28 లక్షల కోట్లు అదీ మన యూపీఐ కెపాసిటీ బాస్

రాష్ట్రపతి హెలికాప్టర్‌ను నెట్టిన సిబ్బంది

TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు

Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..