వాడపల్లికి పోటెత్తిన భక్తులు.. భక్తులతో కిట కిటలాడిన కోనసీమ తిరుమల వాడపల్లి

| Edited By: Subhash Goud

Mar 02, 2024 | 8:46 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం కావడం తో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు..ఉభయ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రంలలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు ఏడు వారాలు ఏడు ప్రదక్షణలు నిర్వహించి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం కావడం తో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు..ఉభయ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రంలలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు ఏడు వారాలు ఏడు ప్రదక్షణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఒక్కరోజే సుమారు 50 వేల మంది పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు… ఉదయం సుప్రభాత సేవతో మొదలైన స్వామి వారి దర్శనం రాత్రి వరకు కొనసాగనుంది… భక్తులకు చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులకు కలకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లి వెంకన్న ఆలయం నమో వెంకటేశాయ నమః స్మరణతో మారుమోగుతుంది.

Follow us on