అడవిలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి శిలా శాసనం..

|

Dec 29, 2023 | 1:48 PM

పల్నాడు ప్రాంతంలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేక శిథిలాలయాలు,వాటికి సంబంధించిన అరుదైన శిల్పాలు ఇప్పటికీ బయటపడుతూ పల్నాడు చరిత్రను చాటిచెబుతున్నాయి. తాజాగా మాచర్ల మండలం కొప్పునూరు సమీపంలోని గుండాల శిథిలాలయం వద్ద పురాతన శిలాశాసనాన్ని చరిత్రకారులు పావులూరి సతీష్, శివశంకర్ గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ప్లీచ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డికి అందజేశారు.

పల్నాడు ప్రాంతంలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేక శిథిలాలయాలు,వాటికి సంబంధించిన అరుదైన శిల్పాలు ఇప్పటికీ బయటపడుతూ పల్నాడు చరిత్రను చాటిచెబుతున్నాయి. తాజాగా మాచర్ల మండలం కొప్పునూరు సమీపంలోని గుండాల శిథిలాలయం వద్ద పురాతన శిలాశాసనాన్ని చరిత్రకారులు పావులూరి సతీష్, శివశంకర్ గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ప్లీచ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డికి అందజేశారు. స్థానికులతో కలిసి శిథిలాలయం వద్ద చేరుకున్న ఆయన దాన్ని భూమిలో నుండి బయటకు తీశారు. ఈ శిలాశాసనం శ్రీక్రిష్ణదేవరాయల కాలం నాటిదిగా గుర్తించారు. ఆ శాసనాన్ని కొప్పునూరుగ్రామానికి తరలించి అక్కడ భద్రపరిచారు. శాసనం క్రీ.శ. 1516 నాటిదని, శాసనంలో క్రిష్ణ దేవరాయలు కొండవీడు, నాగార్జున కొండలను పాలిస్తున్న సమయంలో ఆయన ప్రధాని తిమ్మరుసు చేత నాగార్జున కొండ నాయంకర్ గా ఉన్న బస్వా నాయకుడు మల్లెల గుండాల గ్రామాన్ని స్థానిక తిరువెంగళనాధుని ఆలయ నిర్వహణకు దానం ఇచ్చినట్లు ఉందని శివనాగరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న శాసనం గురించి స్థానికులకు వివరించి దాన్ని తీసుకొచ్చి కొప్పునూరులో పీఠం ఉంచినట్లు ఆయన తెలిపారు. శాసనాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులు తీసుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??

Salman Khan: ఓ మై గాడ్‌.. ఫ్యాన్స్‌ అరుపులతో ఊగిపోయిన సల్మాన్‌ ఇల్లు

Salaar VS Dunki: డైనోసార్ దెబ్బకు.. డంకీ డమాల్..

కెప్టెన్ మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో

Salaar: బాక్సాఫీస్‌ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్‌

Follow us on