27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 రన్స్.. ఉతికి ఆరేయటం అంటే ఇదే మరి..

Updated on: Oct 11, 2025 | 1:44 PM

వీరకొట్టుడు.. దంచికొట్టుడు.. ఆ బ్యాంటింగ్‌ జోరుకు.. ఈ పదాలు సరిపోవంటే నమ్మండి. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో జింబాబ్వే జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఈ అద్భుత ఘనతను సాధించింది.

నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతకుముందు 2023లో మంగోలియాపై నేపాల్ చేసిన 3 వికెట్లకు 314 పరుగుల రికార్డును జింబాబ్వే బద్దలు కొట్టింది. జింబాబ్వే బ్యాటింగ్ ప్రదర్శనలో కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి గాంబియా బౌలర్లకు చుక్కలు చూపించిన రజా, కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా, రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పురుషుల టీ20ఐ క్రికెట్‌లో జాయింట్-సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఈ సెంచరీతో అతను టీ20 లలో సెంచరీ చేసిన తొలి జింబాబ్వే ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఓపెనర్లు తాడివానాషే మారుమణి, బ్రియన్ బెన్నెట్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మారుమణి కేవలం 19 బంతుల్లో 62 పరుగులు చేయగా, బెన్నెట్ 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ క్లైవ్ మదాండే కూడా విజృంభించి కేవలం 17 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మొత్తం 27 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది కూడా టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు. 345 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గాంబియా జట్టు 14.4 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కూడా టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా అత్యధిక విజయ మార్జిన్ రికార్డును నెలకొల్పింది. జింబాబ్వే ఆటగాళ్లు ప్రదర్శించిన ఈ ఉగ్రరూపం టీ20 క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. ఈ మూవీలో ఎన్ని ట్విస్టులో.. ప్రతి సీన్ క్లైమాక్స్

TOP 9 ET News: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి సాంగ్ వీడియో లీక్..

22 ఏళ్ల తర్వాత.. మనసులో మాట బయటపెట్టిన నయన్

ఏం తమ్ముళ్లూ.. ఎలా ఉన్నారు ?? చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో కాల్

రోడ్డు పైకి బాతుల గుంపు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో వైరల్‌

Published on: Oct 11, 2025 01:20 PM