Tennis Star Slammed: భారత్ ఒక మురికి దేశం.! నోరు పారేసుకున్న సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి.

|

Feb 11, 2024 | 11:30 AM

భారత్ లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ జరిగింది. టోర్నీలో పాల్గొన్న సెర్బియా క్రీడాకారిణి డెజానా రదనోవిక్ భారత్ గురించి నోరు పారేసుకుంది. భారత్ ఒక మురికి కూపమని అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐటీఎఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కాస్త ముందుగానే భారత్ కు వచ్చిన రదనోవిక్ దాదాపు 3 వారాలపాటు ఇక్కడే ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

భారత్ లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ జరిగింది. టోర్నీలో పాల్గొన్న సెర్బియా క్రీడాకారిణి డెజానా రదనోవిక్ భారత్ గురించి నోరు పారేసుకుంది. భారత్ ఒక మురికి కూపమని అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐటీఎఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కాస్త ముందుగానే భారత్ కు వచ్చిన రదనోవిక్ దాదాపు 3 వారాలపాటు ఇక్కడే ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. భారత్ లో ఏ అంశం గురించి మాట్లాడాల్సి వచ్చినా దారుణం అని చెబుతానని పేర్కొంది. తనకు భారతదేశం నచ్చలేదనీ తనకు అక్కడి ఆహారం నచ్చలేదనీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ట్రాఫిక్ కూడా నచ్చలేదనీ పరిశుభ్రత అనేదే లేదనీ కామెంట్‌ చేసింది. హోటల్ ఆహారంలో పురుగులు, మాసిన దిండ్లు, మురికిపట్టిన దుప్పట్లు చూసినట్లు తెలిపింది. తమ దేశం సెర్బియాకు రావాలని… ఇవే అంశాలు గనుక మీకు నచ్చలేదు అంటే మీరొక జాత్యహంకారి అన్నమాటే! అంటూ ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రదనోవిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఆమె భారత్ లో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారతీయులే కాదు, అనేక దేశాలకు చెందిన వారు కూడా సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..