PAk player in ICU: ఐసీయూలో 2 రోజులు.. ఆగని వీరోచిత పోరాటం.. ఆ క్రికెటర్ కి ఏమైంది అంటే..?(వీడియో)

|

Nov 20, 2021 | 8:59 AM

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో, అతను మరోసారి హాఫ్ సెంచరీ కొట్టాడు.

YouTube video player
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో, అతను మరోసారి హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో పాకిస్థాన్ 176 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ రిజ్వాన్ క్రీజులో కొనసాగాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ ఈ బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించాడు. అయితే మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వరకు రిజ్వాన్ ఆసుపత్రిలో ఉన్నాడు.

పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, రిజ్వాన్‌కు ఊపిరితిత్తుల సమస్య) సమస్య బ్రాన్‌కైటిస్‌ ఉందని తేలింది. దాని కారణంగా అతను ఒక రాత్రి ఆసుపత్రిలో ఉన్నాుడని మాథ్యూ హేడెన్ తెలిపాడు. . ‘మ్యాచ్‌కు ఒక రోజు ముందు వరకు రిజ్వాన్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఆరోగ్యం బాగోలేకపోయినా జట్టును ఫైనల్కు చేర్చాలని బరిలోకి దిగాడు’ అని పేర్కొన్నాడు. రిజ్వాన్ మైదానంలో పాకిస్తాన్ కోసం ఒక మ్యాచ్ ఆడటానికి ఆసుపత్రి నుంచి కోలుకుని బయటకు రావడమే కాకుండా, ఆస్ట్రేలియాతో ఆడిన రెండవ సెమీ-ఫైనల్‌లో పాక్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను అన్ ఫిట్ అయినా కూడా 87 నిమిషాలపాటు బ్యాటింగ్ చేశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నిస్సందేహంగా ఓడిపోయింది. కానీ, తన బోల్డ్ ఇన్నింగ్స్ కారణంగా రిజ్వాన్ ప్రపంచ హృదయాలను గెలుచుకోగలిగాడు. రిజ్వాన్ చూపిన ఇలాంటి తెగువపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..