Watch Video: ‘శ్రీవల్లీ’ పాటకు చిందులేసిన సురేష్ రైనా.. బ్యాటింగ్‌ స్టెప్స్ అదరహో అంటోన్న ఫ్యాన్స్..!

|

Jan 23, 2022 | 8:51 AM

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప.. ది రైజ్' సినిమా ఎన్నో సంచనాలను క్రియోట్ చేసింది. కోవిడ్ పరిస్థితుల్లోనూ భారీగా వసూళ్లను రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా..

Watch Video: శ్రీవల్లీ పాటకు చిందులేసిన సురేష్ రైనా.. బ్యాటింగ్‌ స్టెప్స్ అదరహో అంటోన్న ఫ్యాన్స్..!
Srivalli Song Viral
Follow us on

Allu Arjun’s Pushpa: సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప.. ది రైజ్’ సినిమా ఎన్నో సంచనాలను క్రియోట్ చేసింది. కోవిడ్ పరిస్థితుల్లోనూ భారీగా వసూళ్లను రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ గా ఒదిగిపోయిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ చెప్పిన ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. అలాగే ‘శ్రీ వల్లీ’ సాంగ్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్ కూడా నెట్టింట్లో తెగ సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన ఈ సందడే నెలకొంది. వీటికి సెటబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే పలు సినిమా డైలాగులు.. పాటలకు స్టెప్పులేసిన క్రికెటర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరాడు. ఇప్పటికే ఈ సినిమాలోని “తగ్గేదేలే” డైలాగ్ చెప్పి ఆకట్టుకున్న రైనా.. ప్రస్తుతం ‘శ్రీ వల్లీ’ సాంగ్‌కు స్టెప్పులు వేసి నెట్టింట్లో వైరలవుతున్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ పాటకు తన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తున్నట్లు స్టెప్పులేశాడు.’నేనే స్టెప్పులేయకుండా ఆగలేకపోతున్నాను. నా స్టైల్‌లో నేను ట్రై చేశాను. సూపర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నావు అల్లుఅర్జున్ బ్రదర్. భారీ విజయం దక్కాలని కోరకుంటున్నాను’ అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాలో విడుదల చేశాడు.

ఇప్పటికే ఈ వీడియోకు 4, 84, 283 లైక్స్ వచ్చాయి. ఎన్నో కామెంట్లు వచ్చాయి. సురేష్ రైనా ఫైర్ మీదున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నాడు. రైనా అంటే ఫవరనుకుంటివా.. ఫైర్ అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read: Funny Video: అమ్మబాబోయ్.. ఇదెక్కడి డ్రామా రా బాబూ.. ఈ చిన్నారి యాక్టింగ్ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Viral Video: పాముతో పోరాడిన ఎలుక.. పిల్లను కాపాడుకుని తరిమి.. తరిమి కొట్టింది..