ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ వీడియో

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో క్రిస్ గేల్‌ను అధిగమించి ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచి మరో మైలురాయిని చేరుకున్నాడు.

Updated on: Jan 14, 2026 | 11:37 AM

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండు అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి వన్డేలో రోహిత్ ఈ అద్భుత ఘనతలను సాధించాడు.రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన రెండు సిక్సర్లతో, వన్డేల్లో ఓపెనర్‌గా అతని సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. ఈ క్రమంలో, 328 సిక్సర్లతో ఉన్న క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..