Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మోడల్ మహికా శర్మ నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పూజలో పాల్గొన్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. గత సంవత్సరం నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న పాండ్యా, ఇప్పుడు మహికాతో కొత్త బంధాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. గత సంవత్సరం తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న పాండ్యా, ఇప్పుడు మోడల్ మాహికా శర్మతో కలిసి ఉన్న ఒక వీడియో చక్కర్ల కొడుతుంది. ఈ వీడియోలో వీరిద్దరూ పూజలో పాల్గొంటున్నట్లుగా కనిపిస్తున్నారు. దీనిని వారి ఎంగేజ్‌మెంట్‌గా చెబుతున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ధృవీకరణ ఇంకా జరగలేదు. మై వడోదర అనే ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ అయిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాండ్యా- మాహికా పక్కపక్కన కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ నలుగురు పండితులు కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. దీనిని కొందరు నెటిజన్లు వీరిద్దరి ఎంగేజ్మెంట్ అని చెబుతున్నారు. ఇటీవల మాహికా శర్మ చేతికి ఒక పెద్ద డైమండ్ రింగ్ కనిపించింది. అప్పుడే ఆమె ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు వచ్చాయి, కానీ ఆమె ఆ వార్తలను ఖండించారు. హార్దిక్ పాండ్యా, మాహికా శర్మ గత కొంతకాలంగా కలిసి కనిపిస్తున్నారు. వీరిద్దరూ మొదట ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆ తర్వాత వారిద్దరూ సుదీర్ఘ వెకేషన్‌కు కూడా వెళ్లారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా, తాము రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఇప్పుడు వీరిద్దరూ తమ బంధంలో తదుపరి అడుగు వేయడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా 2024లో తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా, నటాషా 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్నారు. 2023లో ఉదయ్‌పూర్‌లో వారు మరోసారి సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2024లో విడిపోయారు. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా పేరు కొంతకాలం సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా వినిపించింది. ఆమె ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి కూడా వచ్చేది. కానీ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, మాహికా శర్మతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: ఎలన్ మస్క్ కుమారుడి పేరు శేఖర్
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..
అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్ సీన్.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు
