మరో మోడల్ చుట్టూ హర్థిక్ చక్కర్లు.. అదేనంటున్న నెటిజన్లు
హార్దిక్ పాండ్యా విడాకుల అనంతరం మోడల్ మహియెకా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి వేడుకలు, జిమ్, సముద్రంలో సరదాగా గడిపిన దృశ్యాలు వారి బంధాన్ని ధృవీకరిస్తున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. కుమారుడు అగస్త్య కూడా ఫోటోల్లో ఉండటం ఆసక్తికరంగా మారింది.
స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు. హార్దిన్ నటాషాకు విడాకులు ప్రకటించిన తర్వాత బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మోడల్, నటి మహియెకా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ రూమర్స్ వేళ మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను స్టార్ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో కుమారుడు అగస్త్య కూడా ఉండటం ఆసక్తిగా మారింది. పాండ్యా పోస్టు చేసిన ఓ వీడియోలో వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అందులో ప్రియురాలి బుగ్గపై మార్దిక్ ముద్దు పెడుతూ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఈ ఫొటోలు దివాళీ వేడుకలవిగా తెలుస్తోంది. మరో ఫొటోలో జిమ్‌లో మహియెకాను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చాడు హార్దిక్. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇటీవలే సముద్రంలో ఇద్దరూ జలకాలాడుతూ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఫొటోలను కూడా హార్దిక్ పంచుకున్నారు. దీంతో వీరి డేటింగ్ వార్తలు నిజమేనంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: నయనతారకు .. విఘ్నేశ్ అదిరిపోయే గిఫ్ట్..
కసిగా లవర్ దగ్గరకు వెళ్ళాడు.. ప్రేమగా కొరికి చేతిలో పెట్టింది..
అయ్యో కొడుకా.. నా కడుపున ఎందుకు పుట్టావురా !! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
