కోమాలో ఆసీస్ బ్యాటర్.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డెమియన్ మార్టిన్ మెనింజైటిస్‌తో కోమాలో ఉన్నారు. బ్రిస్బేన్ ఆసుపత్రిలో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ వార్తతో క్రికెట్ లోకం షాకైంది, మాజీ సహచరులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మార్టిన్ కుటుంబానికి మద్దతుగా క్రికెట్ ప్రముఖులు నిలిచారు, ఉత్తమ వైద్యం అందిస్తున్నట్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధృవీకరించారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించిన డెమియన్ మార్టిన్ కోమాతో ఆసుపత్రి పాలయ్యాడు. మెదడు వాపు వ్యాధి మెనింజైటిస్ సోకడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా మార్టిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్టిన్ అస్వస్థత వార్త తెలిసి క్రికెట్ లోకం షాకైంది. ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ సహచర ఆటగాళ్లు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. మార్టిన్‌కు సాధ్యమైనంత ఉత్తమ వైద్యం అందుతోందనీ ప్రజల ప్రార్థనలు, శుభాకాంక్షలు ఆయన కుటుంబానికి ధైర్యాన్నిస్తున్నాయని మార్టిన్ సన్నిహితుడు, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ కూడా మార్టిన్ అనారోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడిన మార్టిన్.. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్‌గా సేవలందించారు. టెస్టుల్లో 46.37 సగటుతో 13 సెంచరీలు సాధించారు. ముఖ్యంగా 1999, 2003 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్లలో సభ్యుడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై విరిగిన వేలితోనే బ్యాటింగ్ చేసి అజేయంగా 88 పరుగులు సాధించిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్, ఆ తర్వాత కామెంటేటర్‌గా పనిచేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
