Viral Video: మైదానంలోనే కాదు.. ఛాహల్, బట్లర్ ఇక్కడా ఇరగదీశారు.. ట్రేండింగ్ లో వీడియో..
ఐపీఎల్-2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ మంచి జోష్‌లో ఉంది. ఇప్పటివరకు10 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక ఆ జట్టు ఆటగాళ్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారు.
ఐపీఎల్-2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ మంచి జోష్‌లో ఉంది. ఇప్పటివరకు10 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక ఆ జట్టు ఆటగాళ్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఓపెనర్ జోస్ బట్లర్ మొత్తం 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉంటే.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు. కాగా చాహల్ సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) భర్త ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ స్టేడియంలో సందడిచేస్తోంది. అలాగే రాజస్థాన్ ఆటగాళ్లతో సరదాగా కలిసిపోతూ వారితో దిగిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈక్రమంలో ధనశ్రీ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో బట్లర్, చాహల్ లు సరదాగా స్టెప్పులేశారు. ‘డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే’ పాటకు ఇద్దరూ ఇరగదీశారు. బట్లర్ స్లో మూమెంట్స్‌తో ఆకట్టుకోగా.. చాహల్ మాత్రంమాస్ స్టెప్పులేసి మెప్పించారు.యూట్యూబ్‌లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన ధనశ్రీ వర్మనే ఈ పాటకు కూడా కొరియాగ్రాఫర్‌గా వ్యవహరించడం విశేషం. కాగా ఈ వీడియోను రాజస్థాన్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసుకున్నారు. దీనికి ధనశ్రీ వర్మ ‘నా మోస్ట్ ఫేవరెట్ రీల్.. మై ఫేవరెట్స్… లవ్’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. కాగా నేటి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడుతోంది రాజస్థాన్. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వెళుతుంది శామ్సన్ సేన.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..