IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది. ఐపీఎల్‌ 2022 లో ఇంట్రెస్టింగ్‌ సీన్‌..

Updated on: May 21, 2022 | 8:20 AM

ప్రస్తుతం ఐపీఎల్‌ 2022 సీజన్‌ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో మే 13న ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌ చూడ్డానికి ఒక చీఫ్‌ గెస్ట్‌ హాజరయ్యారు. ఎవరూ ఊహించలేదు..


ప్రస్తుతం ఐపీఎల్‌ 2022 సీజన్‌ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో మే 13న ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌ చూడ్డానికి ఒక చీఫ్‌ గెస్ట్‌ హాజరయ్యారు. ఎవరూ ఊహించలేదు.. ఊహించని అతిథి ఇలా తమ మ్యాచ్‌ చూడ్డానికి వస్తారని. దాంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే ఎవరూ ఊహించని, ఆ అనుకోని అతిథి ఎవరో తెలిస్తే మీరంతా షాకవుతారు..అవును మే 13న ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఓ పిల్లి చీఫ్‌ గెస్ట్‌లా వచ్చింది. అసదరు పిల్లిగారు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మరి ఆటకు ఎందుకు విరామం అనుకుంటున్నారా.. ఆ పిల్లి సైట్‌స్క్రీన్‌ మీద దర్జాగా కూర్చొని మ్యాచ్‌ చూస్తుంటే అంతరాయం కాక ఇంకేమవుతుంది? పిల్లి జాలీగా ఎంజాయ్‌ చేసినప్పటికి.. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సైట్‌స్క్రీన్‌ ఎదురుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైట్‌స్ర్కీన్‌ నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగినా బ్యాట్స్‌మన్‌ తన ఫోకస్‌ కోల్పోతుంటాడు. సరిగ్గా డుప్లెసిస్‌ను కూడా ఇదే విషయం ఇబ్బంది పెట్టింది. విషయాన్ని అంపైర్‌కు చెప్పడంతో.. మ్యాచ్‌ను కాసేపు ఆపి, సిబ్బందికి చెప్పి పిల్లిగారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన ఆర్‌సీబీ తొలి ఓవర్‌ తర్వాత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ అభిమానులు.. మైదానంలోకి రాకుండానే ఎంత ఇబ్బంది పెట్టింది… దీని దుంపతెగ.. పాడుపిల్లి ఎంత పని చేసింది అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:20 AM
Loading...
Unable to load recommendations.
Follow Us