politicians photo: ఫోజుల కోసం రాజకీయనేతల తాపత్రయం.. ఆటగాళ్లను పక్కకు నెట్టేసి ఫోటోకి ఫోజులిచ్చిన పొలిటికల్ లీడర్..

Edited By: Basha Shek

Updated on: Sep 25, 2022 | 11:22 AM

ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్‌లతోనే కాలం గడిపేస్తుంటారు. తాజాగా డురాండ్‌ కప్‌ ఫైనల్‌


ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్‌లతోనే కాలం గడిపేస్తుంటారు. తాజాగా డురాండ్‌ కప్‌ ఫైనల్‌ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌, ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మధ్య డురాండ్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. సునీల్‌ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ విజయం సాధించింది. అయితే మ్యాచ్‌ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్‌ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్‌ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ లా గణేశన్‌. దీంతో ఫుట్‌బాల్‌ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వరా అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్‌ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 25, 2022 10:32 AM