Viral: స్టేడియంలో కుప్పకూలిన హోర్డింగ్.. పరుగులు తీసిన ప్రేక్షకులు.. వీడియో వైరల్.
వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. భారీ గాలులకు లక్నో స్టేడియంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 32 ఓవర్లు ముగిసిన తర్వాత.. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. భారీ గాలులకు లక్నో స్టేడియంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 32 ఓవర్లు ముగిసిన తర్వాత.. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ సమయంలో స్టేడియంలో భారీ ఈదురు గాలులు వీచాయి. దీంతో దుమ్ము రేగి ప్లేయర్లు, ఫ్యాన్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలుల కారణంగా స్టేడియం పైకప్పు చివర్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ విరిగి పడింది. హోర్డింగ్ పడిన ప్రాంతంలో తక్కువ మంది ప్రేక్షకులు ఉండటం.. వారు ముందే అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది. హోర్డింగ్ పడిపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను మరో వైపుకి తరలించారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్పందించారు. మైదానంలో ఇలా జరగడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం లక్నోలోని ఏక్నా స్టేడియం 5 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గత వారం సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగింది. అక్టోబరు 16న ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఇక ఇదే వేదికగా అక్టోబర్ 29న భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..