మామను చంపిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే..!

Updated on: Apr 19, 2025 | 2:21 PM

అన్ని జన్మల్లో మానవ జన్మ ఎంతో విలువైనదిగా చెబుతదారు. అలాంటిది ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసేస్తున్నారు. ఒకడు భార్య ప్రాణం తీసి కుక్కర్‌లో ఉడకబెడితే... ఒకామె భర్తను నరికి ప్లాస్టిక్‌ డ్రమ్ములో సిమెంట్‌తో సమాధిచేసింది.. తాజాగా ఓ వ్యక్తి తన మామను గొడ్డలితో నరికి, అతని తల తీసుకొని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

 పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఓ ఊర్లో ఉత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ దండానాచా అనే సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరి ఆ నృత్యాన్ని వీక్షిస్తున్నారు. ఆ సమయంలో హరి అనే వ్యక్తిని అతని అల్లుడు ఏదో మాయమాటలు చెప్పి నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో మామను నరికి చంపేశాడు. ఆపై మొండెం నుంచి తలను వేరు చేసి దానిని పట్టుకుని సౌకటి పోలీస్ అవుట్ పోస్టుకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మామపై అతనికి చాలాకాలంగా ఉన్న కక్షతోనే దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.