Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..

Updated on: Mar 16, 2026 | 5:33 PM

ప్రముఖ సింహాచలం ఆలయంలో భక్తుల సమయం ఆదా చేసేందుకు అధునాతన 'సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు' అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద వేచి ఉండకుండా, మొబైల్ స్కాన్ చేసి, యూపీఐతో తక్షణమే దర్శనం/సేవా టికెట్లు పొందవచ్చు. హుండీ కానుకలు, భవిష్యత్తులో అన్నదానం విరాళాలు కూడా వీటి ద్వారా చెల్లించవచ్చు. సాంకేతికతతో పారదర్శక సేవలు అందించడమే ఆలయ లక్ష్యం.

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం ఇకపై మరింత సులభతరం కానుంది. భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు ఆలయ అధికారులు అత్యాధునిక ‘సెల్ఫ్ సర్వీస్ కియోస్క్’ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా, క్షణాల్లో టికెట్లు పొందేలా ఈ డిజిటల్ వ్యవస్థను రూపొందించారు. కొండపైన బస్టాండ్, వీఆర్వో కార్యాలయం వంటి ప్రధాన ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది యంత్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ కియోస్క్ దగ్గరకు వెళ్లి, తమ మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, యూపీఐ ద్వారా నగదు చెల్లించి, నచ్చిన దర్శన లేదా సేవా టికెట్లను పొందవచ్చు. వివిధ రకాల దర్శనాలతో పాటు అర్చనలు, ఇతర సేవా టికెట్లు కూడా ఈ యంత్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల ద్వారా కేవలం టికెట్లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్‌లో హుండీ కానుకలు సమర్పించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. భవిష్యత్తులో అన్నదానం, ఇతర విరాళాలను కూడా ఇదే పద్ధతిలో స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. భక్తులకు ఒత్తిడి లేని, ఆహ్లాదకరమైన దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను జోడించి ఆలయ సేవలను మరింత పారదర్శకంగా మార్చడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’

Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!

పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..

Loading...
Unable to load recommendations.
Follow Us