AP News: కోనసీమలో సముద్రపు దొంగలు.. మడ అడవుల మధ్యలో సీక్రెట్ యవ్వారం..
సముద్రంలోని చేపలను పట్టి జీవనోపాధి పొందడం సహజమే. అయితే సముద్ర గర్భంలోని చేపల గుడ్లను దొంగతనం చేసే దొంగల ముఠా ఒకటి.. తాజాగా వెలుగులోకొచ్చింది. పశ్చిమ బెంగాల్ మార్గం ద్వారా సముద్రంలోకి చొరబడి కరవాక ఓడలరేవు సమీపంలో దుండగులు దొంగతనం చేస్తున్నట్లు కొందరు మత్స్యకారులు గుర్తించారు. దీంతో గోగన్నమఠం ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు.
సముద్రంలోని చేపలను పట్టి జీవనోపాధి పొందడం సహజమే. అయితే సముద్ర గర్భంలోని చేపల గుడ్లను దొంగతనం చేసే దొంగల ముఠా ఒకటి.. తాజాగా వెలుగులోకొచ్చింది. పశ్చిమ బెంగాల్ మార్గం ద్వారా సముద్రంలోకి చొరబడి కరవాక ఓడలరేవు సమీపంలో దుండగులు దొంగతనం చేస్తున్నట్లు కొందరు మత్స్యకారులు గుర్తించారు. దీంతో గోగన్నమఠం ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం గోగున్నమఠం వద్ద సముద్ర ముఖ ద్వారమైన కరవాక ఓడలరేవు వద్ద దొంగలు పడ్డారంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఓడలరేవు ముఖద్వారం వద్ద పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొంతమంది యువకుల ముఠా పాగా వేసింది. సాగర సంగమం సమీపంలోని మడ అడవుల మధ్య సీక్రెట్ గా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. సముద్రముఖ ద్వారం వద్ద చేప పిల్లలను, లార్వాను, రొయ్య పిల్లలను వేటాడి పట్టుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాలోని సముద్రంలో చేపల పునరుత్పత్తి తగ్గిపోయి, చేపలు దొరకటం లేదని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఓఎన్‌జీసీ కార్యకలాపాల కారణంగా వెలువడే రసాయనాలు వల్ల చేపల ఉత్పత్తి సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి లార్వా దశలోనే చేపలను ఎత్తుకెళ్లిపోతే తామెలా జీవించాలని ఆందోళన చేపట్టారు. వీరు చేప పిల్లలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారా, లేదా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారా అని అనుమానిస్తున్నారు. దీనిపై మత్స్యకారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిషరీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఠా సభ్యులు పొంతన లేని సమాధానమిచ్చారు. దాంతో వారివద్దనుంచి ఆధార్ కార్డులను సేకరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిని వెంటనే అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.