స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించింది. వీడియోను బాలుడి బంధువు రికార్డ్ చేసాడు. ఇందులో టీచర్..
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించింది. వీడియోను బాలుడి బంధువు రికార్డ్ చేసాడు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఈ చర్యను ఖండిస్తూ.. టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లికి బురిడీ కొట్టి.. మొబైల్‌ని దాచి ఉంచాడు .. చూస్తే మైండ్ బ్లాంక్