ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది
నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులో పెన్నా నదిలో పూడుకుపోయిన ఓ ప్రాచీన శివాలయం ఇప్పుడు పూర్తిగా బయటపడింది. కరోనా సమయంలో గుర్తించిన ఈ ఆలయాన్ని స్థానిక యువత తవ్వకాలు జరిపి వెలికితీశారు. ప్రభాస్ 'కల్కి' సినిమాతో దీనికి సంబంధం ఉండటంతో పర్యాటక ఆకర్షణగా మారింది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పరశురాముడు ప్రతిష్టించిన ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో పెన్నా నదిలో కలిసిపోయిన ఓ శివాలయాన్ని ఇప్పుడు పూర్తిగా బయటకు తీసారు. గతంలో ఇసుక కింద కూరుకుపోయి ఎవరికి కనిపించలేదు. కరోనా సమయంలో శివాలయం జాడ కనిపించింది. స్థానిక యువత యంత్రాల సాయంతో తవ్వి ఆలయాన్ని గుర్తించారు. ఆలయానికి ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు కూడా ఓ లింక్ ఉంది. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ ఆలయంలో ఎన్నో ఏళ్ల పాటూ ఉన్నట్లు చూపించారు. ఆ ఆలయం ఎక్కడ ఉందా అని ఆరా తీస్తే.. నెల్లూరు జిల్లాలోనే ఉందని తెలిసి చాలా మంది చూసేందుకు వెళ్లారు.శివాలయం ఉన్న ప్రాంతం పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మారింది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆదేశాలతో 2025 జులై లో రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.. శివాలయాన్ని అదే ఆకృతుల్లో నిర్మించేందుకు వీలుగా శిల్పకళ, వాస్తురీతులు నమోదు చేయాలన్నారు. దీని కోసం గత రెండు నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఆదివారం నాటికి ఆలయం పూర్తిగా బయటకు వచ్చింది. అక్కడ స్వామివారు, అమ్మవారితో పాటుగా మరికొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయంలో నాగేశ్వరస్వామి లింగం, పార్వతి దేవి మందిరం, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పెన్నా నది ఆలయం వైపుగా మళ్లడంతో.. అక్కడ గాలులకు ఇసుక మేటలు వేశాయంటున్నారు. ఆ తర్వాత ఆలయం పూర్తిగా ఇసుక కిందకు వెళ్లిపోయిందంటున్నారు. చరిత్రకారులు చెబుతున్న వివరాల ప్రకారం.. పరశురాముడు మాతృహత్యపాప పరిహారార్థం శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారట. స్థానికులు ప్రభుత్వ సాయంతో మళ్లీ పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పురాతన శివాలయం అంశం తెరపైకి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు
సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
అరుదైన బావురుపిల్లిని చూసారా ??
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

