ఆలియాను రీప్లేస్ చేస్తున్న సాయి పల్లవి వీడియో
కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఆలస్యం కావడంతో, దర్శకుడు నాగశ్విన్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ప్రణాళిక రచించారు. మొదట ఆలియా భట్‌ను ఎంపిక చేయగా, ఆమె డేట్స్ సమస్యల కారణంగా ఇప్పుడు సాయి పల్లవిని ప్రధాన పాత్రకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందగలదని నాగశ్విన్ భావిస్తున్నారు.
కల్కి 2 ఆలస్యం కావడంతో దర్శకుడు నాగశ్విన్ ఈ విరామంలో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అప్డేట్ వెల్లడైంది. ప్రధాన తారాగణం విషయంలో నాగశ్విన్ తమ ప్రణాళికలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్నారు నాగశ్విన్. పురాణాలను సైన్స్ ఫిక్షన్ తో కలిపి రూపొందించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అయితే, ప్రభాస్ ప్రస్తుత బిజీ షెడ్యూల్ కారణంగా కల్కి పార్ట్ 2 ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్ లోనే నాగశ్విన్ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
