AP News: పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.!

|

May 02, 2024 | 11:19 AM

మీరు అస్సలు మారరా.? కౌన్సిలింగ్ ఇచ్చినా..! జైలుకి పంపించినా..! ఎలాంటి మార్పు లేదు. అదే పంథా.. మళ్లీ అక్రమ దందా మొదలు. అయితేనేం పోలీసులు ఊరుకుంటారా.? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊసలు లెక్కపెట్టిస్తారు. ఇటీవల ఏపీలోని అల్లూరి జిల్లాలో.. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

మీరు అస్సలు మారరా.? కౌన్సిలింగ్ ఇచ్చినా..! జైలుకి పంపించినా..! ఎలాంటి మార్పు లేదు. అదే పంథా.. మళ్లీ అక్రమ దందా మొదలు. అయితేనేం పోలీసులు ఊరుకుంటారా.? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊసలు లెక్కపెట్టిస్తారు. ఇటీవల ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయిని అమ్ముతున్న కేటుగాళ్ల ఆటను కట్టించారు పోలీసులు. వివరాల్లోకెళ్తే.. అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీగా లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మాడుగుల మండలం అలగాంలో 54కిలోల లిక్విడ్ గంజాయిని సీజ్ చేశారు. ఉళంగి ప్రకాష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ 5.4 కోట్లు రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈజీగా తరలించేందుకు ఏకంగా కుటీర పరిశ్రమను పెట్టి గంజాయిని లిక్విడ్ గా మారుస్తుంది ముఠా. ఒడిస్సాలో ముడిగంజాయి, కర్ణాటక కేరళ నుంచి మిషనరీ కొనుగోలు చేసి ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. లిక్విడ్ గంజాయితో పాటు మిషనరీని సీజ్ చేశారు పోలీసులు. ఈ నెట్‌వర్క్‌లో మొత్తం పది మంది ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఇప్పటికీ ఏజెన్సీలో గంజాయి నిర్మూలించిన.. ఒడిస్సా మంచి గంజాయి తెస్తున్నారని చెప్పారు పోలీస్ అధికారులు.

వీడియో 1:

 

Published on: May 02, 2024 11:17 AM