Kakinada: ప్రైవేట్ బస్సు డిక్కీలో అనుమానాస్పద లగేజి.. ఓపెన్ చేసి చూడగా.!

|

Mar 30, 2024 | 9:44 PM

ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాధపురంలో భారీగా పట్టుచీరలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి పత్రాలు లేని రూ. 2 లక్షల 60 వేలు విలువ చేసే 620 పట్టుచీరలను సీజ్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Follow us on