AP News: పోలీసులను చూడగానే తత్తరపాటు.. బిక్కమొహం.. చెక్ చేయగా దెబ్బకు కళ్లు జిగేల్.!

ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. సరిహద్దుల్లో అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే డబ్బు, వెండి, బంగారం, మద్యం..

Updated on: Apr 30, 2024 | 11:56 AM

ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. సరిహద్దుల్లో అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే డబ్బు, వెండి, బంగారం, మద్యం.. ఇలా అన్ని కూడా భారీగా పట్టుబడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఫార్చునర్ కారులో రెండు బ్యాగుల్లో కోట్లలో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. AP 39 RQ 0999 వాహనంలో కారు డ్రైవర్ ఒక్కడే డబ్బులు తీసుకెళ్తుండగా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన తనిఖీల చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు బ్యాగుల నిండా దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వాహనంగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us