బస్టాండ్ దగ్గర కంగారుగా కనిపించిన ముగ్గురు ప్రయాణీకులు.. వారి బ్యాగులు తెరిచి చూడగా..
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే ఈలోగా వారికి అటుగా బస్టాండ్‌లోకి వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల(ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి)పై అనుమానం కలిగింది. అలాగే సదరు వ్యక్తులు కూడా ఖాకీలను చూడగానే పరుగులు పెట్టారు. ఏదైతేనేం పోలీసులు సిబ్బంది వారిని వెంబడించి మరీ పట్టుకున్నారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురి దగ్గర నుంచి సుమారు రూ. 1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో ఐటీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. కాగా, అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి.. తాడిపత్రిలో అమ్ముతారని గుర్తించారు పోలీసులు.
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

