నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త అందించింది. 2025 సంవత్సరానికి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 8వేల50 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 5,000 గ్రాడ్యుయేట్ పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్ 3,050 పోస్టులు ఉన్నాయి.
ఈ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 28, 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము – శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.. రీజియన్లతో ఆర్‌ఆర్‌బీ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు.. గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్ ఖాళీలను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి గ్రాడ్యుయేట్ పోస్టులకు 16 నుంచి 33 ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. జోన్లు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం
వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయా !! మళ్లీ ఏమైంది
బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే
వెయ్యి కోట్ల వసూళ్ల రేసులో ఇండియన్ సినిమా
అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..
