నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ

Updated on: Dec 17, 2025 | 5:57 PM

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో ALP, మార్చిలో టెక్నీషియన్, ఆగస్టులో NTPC, అక్టోబర్‌లో గ్రూప్-D ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ క్యాలెండర్ అభ్యర్థులకు ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌కు ఉపకరిస్తుంది. జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ వంటి విభాగాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలండర్‌ను విడుదల చేసింది. తాజా జాబ్‌ క్యాలండర్‌ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసిస్టెంట్‌ లోకోపైలట్‌, మార్చిలో టెక్నీషియన్‌, ఏప్రిల్‌లో సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ ఉద్యోగాలు, ఆగస్టులో ఎన్టీపీసి, సెప్టెంబర్‌లో మినిస్టీరియల్‌ అండ్‌ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్‌-డీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఆర్‌ఆర్‌బీ ప్రతీఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ల వివరాలతో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తోంది. క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ ఆయా నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. రైల్వే బోర్డు క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉండేది. కానీ ఇటీవల రాలంలో రైల్వే బోర్డు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థుల ప్రిపరేషన్‌ పక్కాగా సాగించే వెసులుబాటు కలిగింది. కాగా సాధారణంగా రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి.. వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL బ్రాడ్‌బాండ్‌ ఫ్లాష్‌ సేల్‌.. బెనిఫిట్స్‌ ఇవే

ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్‌

వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా