మాస్క్‌లతో బ్యాంకులోకి దుండగులు.. సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి.. ఎంత ఎత్తుకెళ్లారో తెలుసా..?

Updated on: Sep 17, 2025 | 6:54 PM

ఎస్బీఐ బ్యాంకులోకి ఒక్కసారిగా చొరబడి భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. రూ.2 కోట్ల నగదు, 15కేజీల బంగారం ఎత్తకెళ్లినట్లు తెలుస్తోంది. ముసుగులతో వచ్చిన దొంగలు బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, సిబ్బంది చేతులు, కాళ్లు కట్టి.. ఒక గదిలో బంధించి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి పరారయ్యారు. బ్యాంకు మూసివేసి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.

కర్నాటకలోని విజయపుర జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్బీఐ బ్యాంకులోకి ఒక్కసారిగా చొరబడి భారీగా నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. రూ.2 కోట్ల నగదు, 15కేజీల బంగారం ఎత్తకెళ్లినట్లు తెలుస్తోంది. ముసుగులతో వచ్చిన దొంగలు బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, సిబ్బంది చేతులు, కాళ్లు కట్టి.. ఒక గదిలో బంధించి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి పరారయ్యారు. బ్యాంకు మూసివేసి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. SBI సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే డాగ్‌స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ నిపుణులతో తనకీలు నిర్వహించారు. బ్యాంక్ సీసీ కెమెరాలతో పాటు, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. దోపిడీదారులు మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల్లో దొంగల ముఠా మహారాష్ట్ర వైపు వెళ్తుండగా స్థానికులు గమనించారు. దీంతో దొంగల కోసం కర్నాటక, మహారాష్ట్రలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బ్యాంకులో బంగారం పెట్టిన కస్టమర్లలో ఆందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..