ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు
ఢిల్లీలో ఇద్దరు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన ఈ కేసులో హైదరాబాద్, ముంబైకి చెందిన నిందితులు పట్టుబడ్డారు. దాదాపు రూ. 6 కోట్ల విలువైన 9.5 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నుంచి మొదలై ఢిల్లీ మీదుగా చైనా, ఆగ్నేయాసియా దేశాలకు ఈ స్మగ్లింగ్ జరుగుతోంది.
ఢిల్లీలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయంగా జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను సౌత్ ఈస్ట్ ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్, ముంబైకి చెందిన అమిత్ సంపత్ పవార్ ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ. 6 కోట్ల విలువైన తొమ్మిదిన్నర టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి కార్గో విమానాల ద్వారా నేపాల్, మయన్మార్ మీదుగా చైనా, ఆగ్నేయాసియా దేశాలకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు
థియేటర్‌లోకి పంజుర్లి.. షాకైన ఆడియన్స్
