తెలంగాణాలో అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స్
అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స్ తెలంగాణలో కనిపించాయి. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ అడవుల్లో అరుదైన ఇండియన్ ఏషియన్ వైల్డ్ డాగ్స్ సంచారం కెమెరాలకు చిక్కాయి. ఓ నీటి కుంట వద్ద నీళ్ల కోసం వచ్చిన అడవి కుక్కల వీడియో వైరల్ గా మారింది.
కమ్మర్గాం- మురళిగూడ మధ్య అటవీ ప్రాంతాంలోని చెరువు వద్ద మూడు ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచికల్ పేట రేంజ్ పరిధిలో సుమారుగా ఐదు నుంచి పది ఏసియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన వైల్డ్ డాగ్స్ కి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు ఉంటాయంటూ అటవిశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నల్లమల, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆడవులను పెద్దపులులతో పాటు అరుదైన వన్య ప్రాణులు ఆవాసంగా చేసుకోవడం, జీవ వైవిధ్యానికి వేదిక కావడం విశేషమంటున్నారు పర్యావరణ నిపుణులు. ఈ అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స్ దేశంలోని పెంచ్ నేషనల్ పార్క్ , సత్పురా నేషనల్ పార్క్ , డోబా నేషనల్ పార్క్ , దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని బందీపూర్ ఇంకా నాగర్హోల్ నేషనల్ పార్క్ లలో కనిపిస్తాయి. మధ్య భారతదేశం, పశ్చిమ, తూర్పు హిమాలయాలలో, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లలో కూడా వీటిని చూడవచ్చని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూగ జీవాలే అతని టార్గెట్.. విషం పెట్టి మరీ..
భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??
Dhanush: నయనతారపై కేసు పెట్టిన ధనుష్
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా
Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్