Raksha Bandhan: రక్ష కా బంధన్.. ప్రతి ప్రయాణానికి భద్రత వాగ్దానం.. టాటా మోటార్స్ ప్రత్యేక కార్యక్రమం!

Updated on: Aug 11, 2025 | 9:28 PM

కొన్ని బంధాల గురించి చెప్పడానిక మాటలు రావు, కాని మనసుతో ముడిపడి ఉంటాయి. రక్షా బంధన్‌ రోజు ట్రక్‌ డ్రైవర్స్‌కు తెలియని సోదరి నుంచి రాఖీ వస్తే.. కేవలం చేతులే కాదు.. మనసు కూడా కట్టుబడి ఉంటుంది. ఇదే ఆలోచనతో టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ ఇంకా టీవీ9 నెట్‌వర్క ఈ రక్షా బంధన్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

Tata Motors Raksha Bandhan: కొన్ని బంధాల గురించి చెప్పడానిక మాటలు రావు, కాని మనసుతో ముడిపడి ఉంటాయి. రక్షా బంధన్‌ రోజు ట్రక్‌ డ్రైవర్స్‌కు తెలియని సోదరి నుంచి రాఖీ వస్తే.. కేవలం చేతులే కాదు.. మనసు కూడా కట్టుబడి ఉంటుంది. ఇదే ఆలోచనతో టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ ఇంకా టీవీ9 నెట్‌వర్క ఈ రక్షా బంధన్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ సంవత్సరం దేశంలోనే అత్యంత నమ్మకమైన, సురక్షితమైన ట్రక్కులను తయారు చేసే దుర్గా లైన్ మహిళా సిబ్బంది.. తమకు ఎప్పుడూ కలవని, తమకు తెలియని ట్రక్ డ్రైవర్‌ అన్నలకు తమ స్వహస్తాలతో రాఖీలు తయారు చేసిన పంపారు. రక్షా కా బంధన్ అనే ప్రత్యేక చొరవలో నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని ట్రక్ డ్రైవర్లకు అక్కడున్న సోదరీమణులు రాఖీలను కట్టారు. వారు పంపిన ప్రతి రాఖీ హృదయపూర్వక వాగ్దానాన్ని కలిగి ఉంది. ట్రక్‌ డ్రైవర్‌లను వారిని కుటుంబసభ్యుల్లా గౌరవించి ప్రతి ప్రయాణం భద్రంగా ఉండాలన్న బ్రాండ్‌ లక్ష్యాన్ని మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Aug 11, 2025 07:19 PM