పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో నష్టపరిహారం చెల్లింపుల్లో పక్షపాత ధోరణిని నిరసిస్తూ ఆస్తుల యజమానులు ఆందోళన చేస్తున్నారు. తుంకుంటలో ఇచ్చిన పరిహారంతో సమానంగా తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, న్యాయమైన పరిహారం కోసమే పోరాటం అని స్పష్టం చేశారు.
రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ఆరోపిస్తూ ఆస్తుల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్ఖానా చౌరస్తా వద్ద వందలాది మంది బాధితులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 18.6 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ వల్ల సుమారు 1250 ఆస్తులు, వేలాది కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి.జేఏసీ నాయకులు సతీష్ గుప్తా మాట్లాడుతూ, తుంకుంటలో ఇచ్చిన నష్టపరిహారం వలె తమకూ న్యాయమైన రేషియోలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కారిడార్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికీ స్పందించకపోతే కలెక్టరేట్, ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని స్థానిక రాజకీయ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..
రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్
మహేష్ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!
అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?