AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఎడతెరిపి లేని వర్షాలు..

Updated on: Aug 07, 2024 | 1:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, ఏలూరు, విజయవాడ, పాడేరు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పుగోదావరిలో పంట చేలు నీటమునిగాయి. కొన్నిచోట్ల పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. అటు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తోంది. అరకు, పాడేరులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నివాసాల్లోకి మురుగు నీరు వచ్చిన చేరుతుందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 07, 2024 11:57 AM