లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు

Updated on: Jul 29, 2026 | 1:27 PM

పేపర్‌ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అ‍న్నారు. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని ‍అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా కేంద్రం తీరుపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని.. వారిని కేంద్రం అర్థం చేసుకోలేదన్నారు. అన్ని పార్టీలు విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆందోళలను బీజేపీ నేతల పిల్లలు కూడా సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. విద్యారంగం ఇప్పుడు ఖరీదైన వ్యాపారంగా మారిందని..  పేదలు విద్యకు దూరమవుతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమంటున్నారో లైవ్‌లో చూడండి.

Published on: Jul 29, 2026 01:22 PM
Loading...
Unable to load recommendations.
Follow Us