అలర్ట్.. ఉలిక్కిపడ్డ పూరీ క్షేత్రం..రంగంలోకి డాగ్ స్క్వాడ్

Updated on: Jan 21, 2026 | 8:01 PM

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపులు రావడంతో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ కేసులో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, కమాండోలను మోహరించారు.

ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఆలయాన్ని పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ ఆలయానికి చేరుకుని విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఆలయం లోపల, వెలుపల క్షుణ్ణంగా సోదాలు చేసినప్పటికీ, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మామ సినిమాపై బన్నీ అదిరిపోయే రివ్యూ

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం