Andhra Pradesh: కొనసాగుతున్న పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్.. వైసీపీ - టీడీపీ నేతల్లో ఉత్కంఠ..
Pulivendula, Vontimitta Zptc Counting

Andhra Pradesh: కొనసాగుతున్న పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్.. వైసీపీ – టీడీపీ నేతల్లో ఉత్కంఠ..

Updated on: Aug 14, 2025 | 8:22 AM

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను వైసీపీ - టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలుచేశాయి. దీంతో గెలుపు ఎవరిదీ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కడప ఉర్దూ యూనివర్సిటీ‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పులివెందుల ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్‌లోనే పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తికానుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

కాగా పులివెందుల ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం జడ్పీటీసీ ఎన్నిక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. ఈ ఎన్నికను వైసీపీ – టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలుచేశాయి. టీడీపీ నుంచి లతా రెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి ఉపఎన్నిక బరిలో నిలిచారు. దీంతో గెలుపు ఎవరిదీ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Aug 14, 2025 08:21 AM