White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట
తెల్ల జుట్టుపై ఆందోళన అనవసరం. జపాన్ పరిశోధకుల ప్రకారం, జుట్టు తెల్లబడటం అనేది క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రక్రియలో భాగం. మెలనోసైట్లు తమను తాము త్యాగం చేసుకుని క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. ఇది ఒక రకంగా ఆరోగ్యానికి మంచి సంకేతమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాబట్టి తెల్ల జుట్టును చూసి బాధపడాల్సిన అవసరం లేదు.
ఒత్తుగా నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవారు ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం కొందరి సమస్య అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో మరికొందరు ఇబ్బంది పడుతుంటారు. ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు వస్తేనే కంగారు పడతారు. జుట్టు తెల్లబడుతున్న కొద్దీ దాన్ని కవర్ చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు. ఇక తెల్లజుట్టు నల్లగా మారుస్తామని చెప్పే ప్రోడక్ట్స్ మార్కెట్లో ఎన్నో. తెల్లజుట్టుతో ఇన్‌సెక్యూర్ గా ఫీలవడం, ఏజ్ పెరిగిపోయింది అని బాధ పడేవాళ్ళకు లెక్కేలేదు. అయితే జుట్టు తెల్లబడటం మంచిదేనని అంటున్నారు జపాన్ పరిశోధకులు. శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్ లో జుట్టు రంగు కోల్పోతుందని, అది కూడా ఒక రకంగా మంచిదేనని చెబుతున్నారు. అయితే మన దేహంలో మెలనోసైట్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే కణాలు జుట్టుకు నలుపు రంగును అందిస్తాయనీ చెబుతున్నారు. శరీరంలో క్యాన్సర్ గా మారే కణాలను అంతం చేయడానికి ఈ మెలనోసైట్స్ రక్షక కణాలుగా అడ్డుకునే క్రమంలో తమను తాము చంపుకుంటాయనీ అంటున్నారు. అందుకే జుట్టుకు నలుపు రంగు అందక తెలుపు రంగులోకి మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో.. ఇకపై జుట్టు రంగు మారుతుందని బాధ పడాల్సిన పని లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమోసా తింటున్నారా.. తప్పనిసరిగా ఇలా చేయండి.. లేదంటే
దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా
బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!
World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..
Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా
