ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ వెరైటీ ప్రచారం.. బాండ్‌పేపర్‌పై

|

Nov 20, 2023 | 11:28 AM

ఓటు కోసం కోటి తిప్పలు. కొందరైతే ఆ తిప్పల్లో కూడా వెరైటీ చూపిస్తున్నారు. తమతమ నిజాయితీల్ని ప్రూవ్ చేయడానికి రకరకాలుగా తంటాలు పడుతున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వెరైటీ ఫీట్.. ఓటర్లను ఆలోచింపజేస్తోంది. మదన్‌ మోహన్ అనే నేను... అంటూ ముందే ప్రమాణ పత్రం రాసిచ్చేశారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మ‌ద‌న్ మోహ‌న్.

ఓటు కోసం కోటి తిప్పలు. కొందరైతే ఆ తిప్పల్లో కూడా వెరైటీ చూపిస్తున్నారు. తమతమ నిజాయితీల్ని ప్రూవ్ చేయడానికి రకరకాలుగా తంటాలు పడుతున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వెరైటీ ఫీట్.. ఓటర్లను ఆలోచింపజేస్తోంది. మదన్‌ మోహన్ అనే నేను… అంటూ ముందే ప్రమాణ పత్రం రాసిచ్చేశారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మ‌ద‌న్ మోహ‌న్. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఒక్క రూపాయి క‌మిష‌న్ తీసుకున్నట్టు రుజువైనా, వెంటనే రాజీనామా చేస్తాన‌ని ఇప్పుడే అఫిడవిట్ రాసిచ్చారు. 100 రూపాయ‌ల బాండ్ పేప‌ర్‌పై ఆయన ఓటర్లకు రాసిన హామీపత్రం వైరల్ అవుతోంది.

ఇప్పుడున్న ఎమ్మెల్యే సురేంద‌ర్ క‌మిష‌న్ల రాజ్యం నడిపిస్తున్నారని, జనం గగ్గోలు పెడుతున్నారని, తనకు అవకాశమిస్తే మార్పు చూస్తారని మాటిచ్చారు మదన్‌మోహన్. ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క రూపాయి జీతంతో ప‌ని చేస్తాను.. అనేది ఆయన చేసిన మరో ప్రామిస్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Nov 20, 2023 11:27 AM