Left Parties: పాపం కామ్రేడ్లు.. ఎటు వెళ్తారో… ఏం చేస్తారో..?
మునుగోడు సాక్షిగా హామీ ఇస్తిరి...నాలుగు సీట్లే అడిగితిమి..కలిసి పోటీ చేద్దమని చెబితిమి..అందుకు సరే అని..తర్వాత లెప్ట్ లెఫ్ట్ అంటారా...ఫ్రస్టేషన్ కామ్రెడ్.. అంటూ మన ఎర్రజెండా నేతలు తెగ ఇదైపోతున్నారట. లెఫ్ నేతలు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్‌తో...తామేంటో చూపిస్తారట. తమ బలమేంటో నిరూపిస్తారట..ముఖ్యంగా..తమను వద్దన్నవాళ్ల అంతు తేలుస్తారట. ఎంత ప్రస్ట్రేషన్‌లో ఉన్నారో కదా మన కామ్రెడ్లు. అయినా ఆమాత్రం ప్రస్ట్రేషన్ ఉంటుందిలో..అసలే ఎన్నికల కాలం. జతకట్టే తోడు లేక..అడిగినన్ని సీట్లు ఇచ్చే దొస్తీ దొరకక...ఒంటరిగా వెళ్లే సాహసం చేయలేక..ఏదో మునుగోడు సాక్షిగా ఏదో ఆసరా దొరికిందని ఆనందపడితే...చివరికి ఆశనిరాశయ్యే.
డియర్ కామ్రెడ్స్ గెట్ రెడీ..మనల్ని మోసం చేసినోళ్ల అంతు చూద్దాం.. డియర్ కామ్రెడ్స్ పదండి తోసుకు…మనల్ని పక్కనపెట్టినోళ్లకు మన బలమేంటో చూపిద్దాం..డియర్ కామ్రెడ్స్ తొడగొట్టండి…పొత్తుపెట్టుకుంటే దోస్తీ…లేకుంటే కుస్తీ..అంటూ ఎర్రజెండా నేతలు ఎరుపెక్కిన కళ్లతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారట. కానీ మాట్లలోఊపుంది కానీ..చేతల్లో అంతా ఊపు కనిపించడంలేదట. ఎర్రజెండాలను చూస్తే..పార్టీలన్నీ ఎర్రజెండా చూపిస్తున్నాయట. ఒకప్పుడు తెలుగురాష్ట్రాల్లో చక్రం తిప్పిన లెఫ్ట్‌పార్టీలను లెప్ట్ అనే పరిస్థితి ఎందుకొచ్చింది…