రేపే మెస్సీ Vs సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్
రేపు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ కార్యక్రమం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించి, హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ సెషన్ కూడా ఉంది.
రేపు ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ, మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. ఆయన సంగారెడ్డి జిల్లా కంకోల్ వోక్సన్ వర్సిటీలో రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్ లేదా పాస్‌లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి ప్రవేశం ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..
Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్ అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా
