Tirumala: తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత.. వీడియో
తిరుమల సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తిరుమల సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్షణం సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తామన్నారు. తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై ప్రశంసలు కురిసినప్పటికీ, డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన వైవీ సుబ్బారెడ్డి సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై అధికారులతో చర్చించినట్టు పేర్కొన్నారు. పాలకమండలి లేనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వామి వారి ప్రసాదంగానే భోజనం అందించాలని, డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించామని వైవీ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Side Effects of Kiwi: కివీ ఫ్రూట్స్ తింటున్నారా.. ఈ సమస్యులు ఉన్నవాళ్లు తింటే డేంజర్.. వీడియో
Viral Video: గిన్నిస్ రికార్డ్ కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో
Viral Video: బరువు అదుపులో ఉంచండి.. నెల జీతం బోనస్ కొట్టేయండి..!! వీడియో