కొండగల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లి రేవంత్ నామినేషన్
అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత శుక్రవారం మొదలైంది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 నామినేషన్లు దాఖలయ్యాయి. పండితులను, జ్యోతిష్యులను సంప్రదించి.. జాతకాలు, శుభ ఘడియలు, నక్షత్రాలు, తిథులు చూసుకొని పలు పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెంట్స్ నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు.
తెలంగాణలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ కొండగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు కార్యకర్తలు. కార్యకర్తలనుద్దేశించి రేవంత్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 06, 2023 12:16 PM