కవిత కొన్ని కఠోర సత్యాలు మాట్లాడారు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ బిడ్డ కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్ధం కావడం లేదు అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ విషయంలో ఆమె మాట మార్చిందన్నారు. బాణం హరీష్‌రావుపైకి ఎందుకు తిరిగిందో తెలియడం లేదని మహేష్‌గౌడ్ చెప్పుకొచ్చారు. ఆమె మాటలు వింటే కవిత కేసీఆర్ విడిచిన బాణం అనకుంటున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ బిడ్డ కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్ధం కావడం లేదు అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ విషయంలో ఆమె మాట మార్చిందన్నారు. బాణం హరీష్‌రావుపైకి ఎందుకు తిరిగిందో తెలియడం లేదని మహేష్‌గౌడ్ చెప్పుకొచ్చారు. ఆమె మాటలు వింటే కవిత కేసీఆర్ విడిచిన బాణం అనకుంటున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అయితే.. కవిత కొన్ని కఠోర సత్యాలు మాట్లాడారని.. అయితే అదే సందర్భంలో కొన్ని అసత్యాలు కూడా చెప్పారని మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.
కవితకు తెలియకుండానే ఇంతకాలం అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు మహేష్‌గౌడ్. 10ఏండ్లు అవినీతిలో భాగస్వామ్యమై ఇప్పుడు తనకేమీ సంబంధం లేదన్నట్టు మాట్లాడటం ఏంటన్నారు పీసీసీ ప్రెసిడెంట్. దొంగల ముఠా మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయని.. అందుకే కవిత బయటపడ్డారన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసినట్టేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్‌గౌడ్. చచ్చిన పాముని ఇంకా చంపే అంత తీరిక లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
