KTR: అందుకే మేనిఫెస్టోలో ఆ రెండు పథకాలను చేర్చాము - మంత్రి కేటీఆర్‌
Telangana Minister KTR

KTR: అందుకే మేనిఫెస్టోలో ఆ రెండు పథకాలను చేర్చాము – మంత్రి కేటీఆర్‌

|

Oct 15, 2023 | 9:14 PM

. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జీవితా బీమా ఉండే ఎంతో బాగుంటుందని, అందుకే ఒక మతానికే కాకుండా అన్ని వర్గాల వారికి ఏదో ఒక ఉపయోగకరమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్‌కు వివరించడంతో రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్‌ వర్తించేలా పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కేటీఆర్‌ చెప్పారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్‌ తీసుకుని మధ్యలో ప్రీమియం నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రజలకు అలాంటి ఇబ్బంది..

మా కమిట్‌మెంట్‌అంతా కూడా రాష్ట్రంలోని ప్రజలను బలోపేతం చేయడమేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల కోసమే మేనిఫెస్టోలో కొత్త పథకాలను చేర్చినట్లు చెప్పారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ఇంటర్వ్యూలో BRS మేనిఫెస్టోలో తనకు బాగా ఇష్టమైన స్కీమ్ ఏదో వెల్లడించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా తనకు ఇష్టమైన పథకమని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం గురించి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జీవితా బీమా ఉండే ఎంతో బాగుంటుందని, అందుకే ఒక మతానికే కాకుండా అన్ని వర్గాల వారికి ఏదో ఒక ఉపయోగకరమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్‌కు వివరించడంతో రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్‌ వర్తించేలా పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కేటీఆర్‌ చెప్పారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్‌ తీసుకుని మధ్యలో ప్రీమియం నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయి.

అందుకే ప్రజలకు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే వారి ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఇక రెండో పథకం ప్రవేశపెట్టింది అన్నపూర్ణ పథకం. ఈ రోజుల్లో 68 లక్షల టన్నుల బియ్యం పండే తెలంగాణ.. కేసీఆర్‌ వచ్చిన తర్వాత మూడున్న కోట్ల టన్నుల మేర పండించే రాష్ట్రం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలను దాటి ఈ రోజు దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. అలాగే రాష్ట్రంలో రేషన్‌ షాపు ద్వారా ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం ఇవ్వకుండా సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచి ప్రజలకు పంచాలనేది కేసీఆర్‌ ఉద్దేశమని అన్నారు.

Published on: Oct 15, 2023 07:55 PM