Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Updated on: Apr 03, 2026 | 3:35 PM

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సాగు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధులు ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.2,650 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఈ నిధులు అన్నదాతలకు గొప్ప ఆర్థిక ఊరటనిస్తాయి.

తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’ పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ విడత కోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వ ఇతర వ్యయాలు, అత్యవసర చెల్లింపులను బేరీజు వేసుకుంటూనే, రైతులకు సకాలంలో సాయం అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం ఈసారి దశలవారీగా నగదు పంపిణీ చేస్తోంది. ఈ రెండో విడతలో ప్రధానంగా ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ. 3,590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ. 6,000 చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం పూర్తిస్థాయి అమలుకు సుమారు రూ. 9,000 కోట్లు అవసరమని అంచనా. నిధుల పరిమితుల దృష్ట్యా, ప్రభుత్వం మూడు విడతల విధానాన్ని ఎంచుకుంది. మొదటి విడతలో భాగంగా చిన్న రైతులకు నదగు పంపిణీ ఇప్పటికే పూర్తి చేసింది. రెండో విడతలో భాగంగా ఈ నెల రెండో వారంలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులు నగదు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక మూడో విడతగా మిగిలిన రైతులందరికీ ఈ నెల చివరి నాటికి నగదు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా రైతుల ఖాతాలకే నగదు బదిలీ చేయడం ద్వారా పారదర్శకతను కాపాడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ నిధులు రైతులకు గొప్ప ఆర్థిక ఊరటనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us