KTR: న్యాయం అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులా ??

Edited By:

Updated on: Feb 24, 2026 | 9:00 PM

ఆదిలాబాద్ జైల్లో సుమన్‌ను పరామర్శించిన కేటీఆర్, తెలంగాణ డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దుర్భాషలాడిన కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసులు లేవని, న్యాయం కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. క్యాథన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై అధికార యంత్రాంగం కుమ్మక్కైందని ఆరోపించారు.

ఆదిలాబాద్ జైల్లో బీఆర్ఎస్ నేత సుమన్‌ను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) రాష్ట్ర డీజీపీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించిన కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్‌లపై కేసులు లేవని, కానీ న్యాయం కోసం ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. క్యాథన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇచ్చినా, స్థానిక మంత్రి, అధికార యంత్రాంగం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని కేటీఆర్ ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

Loading...
Unable to load recommendations.
Follow Us