Telangana LS Polls 2024: కాంగ్రెస్ – ఎంఐఎం బంధంపై మరింత స్పష్టత.. అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేయబోతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే చర్చ జరుగుతుండగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్‌తో దీనిపై మరింత స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో బంధంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేయబోతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే చర్చ జరుగుతుండగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్‌తో దీనిపై మరింత స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో బంధంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్‌కు బీ టీమ్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ కాంగ్రెస్ నేతలే తమతో కలుస్తున్నారని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమతో కలిసి పనిచేస్తాయని చెప్పుకొచ్చారు.
ఎంఐఎంను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదన్న అక్బరుద్దీన్.. రావులు, రెడ్లు ఎంత మంది ఎలా కలిసి వచ్చినా గెలుపు తమదేనన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ గెలుపు కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ గత వారం మీడియాకు వెల్లడించారు. దీనికి బదులుగా తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్ధతు తెలిపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో బంధంపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.