Watch Video: బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

|

May 03, 2024 | 12:56 PM

ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయంటూ ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ9 నెట్‌వర్క్ ఎడిటర్స్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయంటూ ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆరోపణలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ పదేళ్లుగా దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలనే నరేంద్ర మోదీ కాపీకొట్టారని అన్నారు. ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని.. ప్రాంతీయ పార్టీలు లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తుకు తాము ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నారు. బీఆర్ఎస్‌ ఎవరికీ బీ టీమ్‌ కాదన్నారు నామా నాగేశ్వరరావు. నామా నాగేశ్వరరావు ప్రధాని మోదీ ఆరోపణలపై ఇంకా ఏమన్నారో పై వీడియోను చూడండి..