Watch Video: కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై రేణుక చౌదరి తీవ్ర అసంతృప్తి.. ఏమన్నారంటే..?

|

Oct 27, 2023 | 3:28 PM

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. బీసీలు, కమ్మలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత తక్కలేదన్నారు. అలాగే బయటనుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్టానం ఇవాళ.. లేదా రేపు విడుదల చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. బీసీలు, కమ్మలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత తక్కలేదన్నారు. అలాగే బయటనుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలన్నారు రేణుక. ఇకనైనా టికెట్ల కేటాయింపులు వారికి పార్టీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్టానం ఇవాళ.. లేదా రేపు విడుదల చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీలోని 119 స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.