Telangana Elections: “పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే..” మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు – Watch Video

| Edited By: Ram Naramaneni

Nov 23, 2023 | 1:52 PM

అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్సే తమ ప్రధాన ప్రత్యర్థి అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సే అన్నారు.  కాంగ్రెస్‌ చెబుతోన్న మార్పుపై సెటైర్లేశారు. రేవంత్‌రెడ్డి రెండు చోట్లా ఓడిపోబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న టీవీ9 పొలిటికల్ కాంక్లేవ్‌లో పలు అంశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో రియల్‌ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అవడం ఖాయమన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా దీనికి కారణాలను సైతం కేటీఆర్ విశ్లేషించారు.  కాంగ్రెస్ గెలిస్తే.. ప్రతి ఆరు నెలలకు సీఎంను మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఇవ్వలేరన్నారు. అలాగే పాలనాపరమైన నిర్ణయాలను త్వరగా తీసుకోలేరని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బెంగుళూరులో రియల్ ఎస్టేట్ రంగం పడిపోతున్నట్లు నివేధికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధి సాధిస్తోందన్నారు.

అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్సే తమ ప్రధాన ప్రత్యర్థి అన్న కేటీఆర్‌… గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సే అన్నారు.  కాంగ్రెస్‌ చెబుతోన్న మార్పుపై సెటైర్లేశారు. రేవంత్‌రెడ్డి రెండు చోట్లా ఓడిపోబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌.

Published on: Nov 23, 2023 01:41 PM